వాట్సప్‌లో మరో ఆరు ఫీచర్లు…
ప్రజల మనసు చూరగొనేలా వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకువస్తోంది. జనానికి చేరువయ్యేలా ఇందులో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. దీనిలో భాగంగా మరో ఆరు ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.
మనం ఇప్పటి వరకు మెసేజ్ పంపితే దాంట్లో ఏవైనా మార్పులు చేర్పలు చేయాలంటే సాధ్యం అయ్యేది కాదు. కానీ,ఇప్పుడు పంపించిన మెస్సేజ్‌లో మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఒకసారి పంపించిన తరువాత వెంటనే ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే చేయవచ్చు.
ఛాట్‌లో కన్పించని ముఖ్యమైన మెస్సేజ్‌ను సేవ్ చేసుకునే అవకాశం. కాంటాక్ట్ జాబితాలోంచి, గ్రూప్ ఇన్‌ఫో నుంచి కావల్సిన మెస్సేజ్ సేవ్ చేసుకునేందుకు వీలుగా వాట్సప్ కొత్త సెక్షన్ యాడ్ చేయనుంది. స్టేటస్ అప్‌డేట్ వంటివి బదిలీ చేసేటప్పుడు అవకాశం కల్పించే కొత్త ఫీచర్ తీసుకురానుంది. అంతేకాకుండా స్టేటస్ అప్‌డేట్ కోసం నిర్ణీత ఆడియన్స్ ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
ఇక మరో ముఖ్యమైన ఫీచర్ వాట్సప్ ప్రీమియం. ఇది బిజినెస్ కస్టమర్లకు సబ్‌స్క్రిప్షన్‌పై లభించే సౌలభ్యం. ఈ ఆప్షన్ పది డివైసెస్ వరకూ లింక్ అవుతుంది. వ్యాపారవర్గాలకు దోహదపడుతుంది. మరో ఫీచర్ గ్రూప్ నుంచి ఎవరికీ అంటే సభ్యులకు తెలియకుండా ఎగ్జిట్ అవడం. కేవలం అడ్మిన్‌కు మాత్రమే తెలుస్తుంది.
వాట్సప్ ఐవోఎస్ బీటా వెర్షన్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఆల్బమ్స్‌పై డిటైల్డ్ రియాక్షన్ అవకాశం కలుగుతుంది. మీ ఆల్పమ్ లేదా ఫోటో లేదా వీడియోపై ఎవరైనా రియాక్ట్ అయితే..ఎవరు రియాక్ట్ అయ్యారో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.