ఎవ‌రేం చేశారో కార్మికుల‌కు తెలుసు…

-TBGKS గెలిచిన త‌ర్వాతే హ‌క్కుల సాధ‌న‌
-జాతీయ కార్మిక సంఘాలు ఉన్న వాటిని పోగొట్టారు
-రాజ‌కీయ జోక్యంతోనే కార్మికుల‌కు మేలు జ‌రిగింది
-తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు

మంచిర్యాల : ఎవ‌రేం చేశారో కార్మికుల‌కు తెలుసున‌ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ఆర్‌కే 7 గ‌నిలో నిర్వ‌హించిన స‌మావేశంలో పాల్గొని మాట్లాడారు. టీబీజీకేఎస్‌ గెలిచిన తర్వాతే కార్మికులకు ఎన్నో హక్కులు సాధించామ‌న్నారు. కోల్ ఇండియాలో లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన‌ట్లు తెలిపారు. కొన్ని జాతీయ సంఘాలు పనిగట్టుకొని కార్మికులకు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. వాటిని కార్మికలోకం తిప్పి కొడుతుందన్నారు. జాతీయ సంఘాలు కార్మికులకు ఏం చేశాయో, ఏం చేయబోతున్నాయో చెప్పాలన్నారు.

రాజకీయ జోక్యం వల్లే కోల్ ఇండియాలో లేనివిధంగా సింగరేణి కార్మికులకు ఎన్నో హ‌క్కులు వ‌చ్చాయ‌ని తెలిపారు. రాజకీయ జోక్యం లేకపోతే ఇన్ని హక్కులు సాధ్యమయ్యేయా..? అని ప్ర‌శ్నించారు. చాలా మంది కార్మికుల బిడ్డలకు సింగరేణిలో ఉద్యోగo వచ్చిందంటే కారణం ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. జోక్యం వల్ల కాదా…? అన్నారు. కొన్ని జాతీయ సంఘాలు కావాలని కార్మికుల్లో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. జాతీయ సంఘాలు చెప్పే మాటలను ఎవరు నమ్మకుండా కార్మికుల కోసం ఎల్లప్పుడూ పని చేస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఆదరించాలని కోరారు.

ఏరియా వైస్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన స‌మావేశంలో కేంద్ర ఉపాధ్యక్షుడు మందమల్లారెడ్డి,డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్లఅశోక్, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగలకుమారస్వామి,పెట్టంలక్ష్మణ్,ఏరియా సెక్రటరీ అశోక్ , ఏరియా నాయకులు తొంగల రమేష్,పిట్ సెక్రటరీ మెండ వేంకటి,అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ప్రేమ్ కుమార్,చిలుముల రాయమల్లు, సత్యనారాయణ,అజీజ్ పాషా,రాజు నాయక్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like