సీనియర్ పాత్రికేయుడి మృతి
సీఎం కేసీఆర్ సంతాపం
సీనియర్ జర్నలిస్టు,ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్, మెండు శ్రీనివాస్ మరణించారు. ఆయన స్వగ్రామం పరకాల లో ఉన్న ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్ మరణం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టుగా, ఆంధ్రజ్యోతి పత్రిక తరపున, సీఎంఓ బీట్ రిపోర్టర్ గా మెండు శ్రీనివాస్ అందించిన జర్నలిజం సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.