టీబీజీకేఎస్ నుంచి ఐఎన్‌టీయూసీలో చేరిక
పార్టీలో చేరిన ఇద్దరు నేతలకు కీలక పదవులు
రామగుండం రీజియన్‌లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ యూనియన్‌లో ముఖ్యనేతలు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీలో చేరారు. ఆ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో సెంట్రల్ కమిటీ నాయకుడు పెంచాల తిరుపతి, ఓసిపి 4 మాజీ ఫిట్ సెక్రటరీ జనగామ శ్రీనివాస్ గౌడ్ చేరారు. యూనియన్‌లో చేరిన ఇద్దరు నేతలకు కీలక పదవులు అప్పగించారు. పెంచాల తిరుపతికి ఆర్జీ1 ఉపాధ్యక్షుడుగా, జనగామ శ్రీనివాస్ గౌడ్ కు ఆర్జీ1 ఓసిపి5 ఫిట్ సెక్రటరీగా నియమిస్తూ జనక్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలోనే కార్మికులకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. అందుకే తమ యూనియన్‌లోకి నేతలు వలసలు వస్తున్నారని తెలిపారు. మరింత మంది టీబీజీకేఎస్ నేతలు తమ యూనియన్‌లో చేరుతారని స్పష్టం చేశారు.