అమరుల సాక్షిగా పోరాటం..
అమర వీరుల సాక్షిగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఆదివాసీ గిరిజన మహిళలు వెల్లడించారు. బుధవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ ఆదివాసీ గిరిజన మహిళలు ఇంద్రవెళ్లి అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అక్రమంగా కేసులు పెట్టిన ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెందుర్ ప్రభాకర్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడ్మేత తిరుపతి,జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్,ఆదివాసీ అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేందుర్ ప్రభాకర్, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు జుగ్నక్ భారత్, ఉపాధ్యక్షుడు గేడం భారత్,విద్యార్థి సంఘం ప్రచార కార్యదర్శి కాత్లే పృథ్విరాజ్,ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.