ప్రజా సమస్యల పరిష్కారానికి ముందువరుసలో బీజేపీ

మంచిర్యాల : ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ ముందు వరుసలో ఉంటుందని మంచిర్యాల జిల్లా భాజపా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునందన్ స్పష్టం చేశారు. ఆయన తాండూరు మండలం రాజీవ్ నగర్ కాలనీ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 154/2, 154/3 సర్వేనెంబర్లో సుమారు రెండు వందల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిందన్నారు. ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ఇక్కడ కొంతమంది నివసిస్తున్నారని తెలిపారు. మరికొంతమంది ఇంటి పన్నులతో పాటు విద్యుత్ మీటర్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ప్రస్తుత తహసీల్దార్ ఇది ప్రభుత్వ భూమి అని వేరే అవసరాల నిమిత్తం కోసం దీనిని కేటాయించినట్లు చెప్పారని అన్నారు. చాలామంది నిరుపేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ సమస్యపై త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ తో మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని అక్కడి కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ సమస్య పైన పార్టీలకు అతీతంగా అందరు కలిసి నిరుపేదలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ తాండూరు మండల అధ్యక్షుడు రామగౌని మహీధర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, మండల ప్రధాన కార్యదర్శి విష్ణు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.