అన్నదాతకు మద్దతు పెరిగింది..
ఢిల్లీ : అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 ఖరీఫ్ సీజన్‌కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 పంటలకు మద్దతు ధరను పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
-సాధారణ వరి క్వింటాల్ కనీస మద్దతు ధరను రూ.100 పెంచారు. దీంతో క్వింటాల్ ధర రూ.2,040కి చేరింది.
-నువ్వుల కనీస మద్దతు ధర క్వింటాల్‌పై రూ. 523 పెరిగింది.
-పెసర్లపై రూ.480 (క్వింటాల్‌కు) ఎంఎస్‌పీ పెంచారు.
-పొద్దుతిరుగుడు విత్తనాల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.385 పెరిగింది.
-మినుములపై మద్దతు ధర క్వింటాల్‌కు రూ.300 పెంచారు.
-మధ్య రకం పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌పై రూ.354 పెరిగింది.
-సోయాబీన్ మద్దతు ధరను క్వింటాల్‌పై రూ.350 పెంచారు.
-కందుల మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.300 పెంచారు.
-హైబ్రీడ్ జొన్నల మద్దతు ధర క్వింటాల్‌పై రూ.232 పెరిగింది.
-సజ్జల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.100 పెరిగింది.
-మొక్కజొన్న మద్దతు ధరను క్వింటాల్‌పై రూ.92 పెంచారు.