సిట్టింగులు ఆశలు పెట్టుకోకండి
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగులు తమ స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ చీఫ్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది సిట్టింగ్ స్థానాలు వదులుకోవాల్సి వస్తుందన్నారు. గ్రూప్ రాజకీయాలు ఉండకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని తెలిపారు. PK సర్వే TRS కు అనుకూలంగా ఉందని అన్నారు. 18, 19న డిల్లీ లో జాతీయ పార్టీ కి రూపురేఖలు వస్తాయని వెల్లడించారు. పార్టీలో అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. దేశంలో రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతోందని, అది మన TRS తోటే అన్నారు. ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలని, మళ్ళీ అధికారం మనదేనని కేటీఆర్ స్ఫష్టం చేశారు.