వేములవాడ… భక్తులతో కిటకిట..
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని తరించారు. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. గర్భాలయంలోకి ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. భక్తులు కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు.