ఆరు లక్షల మంది కి అంబలి పంపిణీ
మంచిర్యాల: 31 రోజుల్లో సుమారు ఆరు లక్షల మందికి జొన్న అంబలి పంపిణీ చేసినట్లు కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ వెల్లడించారు. సోమవారం అంబలి పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత నెల మే 14వ తేదీ నుండి మంచిర్యాల ఐబీ చౌరస్తా, ఆర్టీసీ బస్స్టాండ్,ccc,శ్రీరాంపూర్,లక్సెట్టిపేట కేంద్రాలలో అంబలి పంపిణీ ఏర్పాటు చేశామని తెలిపారు. వేసవిలో ఎంతోమందికి మినరల్ వాటర్ పంపిణీ చేసినట్లు చెప్పారు. అనేక కాలనీలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేశామన్నారు. కార్యక్రమాల్లో పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
నిరాటకంగా పంపిణీ చేసిన ప్రేమ్ సాగరన్న ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం మంగళవారంతో ముగింపు పలక నున్నట్లు ఆమె వివరించారు. రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం చల్లబడి వర్షాలు పడే అవకాశం ఉన్నందున చలివేంద్రాలు తాగునీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కూడా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు.