ఆందోళనలతో దద్దరిల్లుతున్న బాసర త్రిపుల్ ఐటీ
బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళనతో దద్దరిల్లుతోంది. మంగళవారం ఉదయం నుంచి విద్యాలయంలోని ఐదు వేల మంది విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. అల్పాహారం మానేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ కార్యాలయం ఎదుట భైఠాయించి ధర్నా చేపట్టారు. రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ను నియమించాలని.. పర్మనెంట్ ఉద్యోగుల నియామకం చేపట్టాలని , ల్యాప్ టాప్, యూనిఫామ్స్ అందించాలని తాగునీటితో పాటు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆరు గంటలుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన విషయం బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు అక్కడ ఇంటర్‌నెట్ బంద్ చేశారు. మీడియాను లోపలికి అనుమతించక పోవడంతో విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు చూసి వెళ్లడం తప్ప న్యాయం చేసిన దాఖలాలు లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఎస్పీ ఇతర పార్టీల మద్దతు ప్రకటించి ఆందోళనకు మద్దతు తెలిపాయి. యూనివర్సిటీలో పోలీసుల మోహరించారు. మీడియాకు నో ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుందో తెలియడం లేదు.. బీఎస్పీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు…