శాశ్వత గార్డులను నియమించండి
మంచిర్యాల : బెల్లంపల్లి ఏరియాలో శాశ్వత గార్డులను ఏర్పాటు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఏరియా పర్యటనకు వచ్చిన సందర్భంగా సింగరేణి చీఫ్ఆఫ్ సెక్యూరిటీ హన్మంతురావుకి టీబీజీకేఎస్ నేతలు వినతిపత్రం అందించారు. పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా సెక్యూరిటీ గార్డులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ సమస్యలపై సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు మల్రాజ్ శ్రీనివాస్ తెలిపారు. వారితో పాటు మేనేజర్ సెక్యూరిటీ వరప్రసాద్,ఇన్స్పెక్టర్ రాజమౌళి ఉన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ 11 మెన్ కమిటీ మెంబర్ ధరావత్ మంగీలాల్, జీఎం ఆఫీస్ కార్యదర్శి గడ్డం రవీందర్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శులు యుగంధర్, మంకయ్య ,సార్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.