విద్యుత్ సబ్ స్టేషన్ పై పిడుగు
కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పై మంగళవారం సాయంత్రం పిడుగు పడింది. దీంతో ఆపరేటర్ సురేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. సురేష్ ని సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాగజ్నగర్ తీసుకెళ్లారు. సబ్స్టేషన్ పై పిడుగు పడటంతో మండల కేంద్రంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. . విద్యుత్ శాఖ అధికారులు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.