టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ కౌన్సిలర్
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కౌన్సిలర్ మోతె సుజాత కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆమె టీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పాల్గొన్నారు.