బ్రేకింగ్… నిర్మల్లో ఇద్దరు ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం
నిర్మల్ : నిర్మల్లో ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం సృష్టించింది. మామడ అటవీ రేంజుపరిధి లోని ఆరెపల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్, బీట్ ఆఫీసర్ వెన్నెల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అధికారులు అకారణంగా సస్పెండ్ చేశారని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. వీరి పరిస్థితి విషమంగా మారడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.