విద్యార్థులను తక్కువగా అంచనా వేయకండి
అహంకారపూరిత కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కుగా అంచనా వేయకూడదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు.నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై రాహుల్ స్పందించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్లను సిల్లీగా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం కేసీఆర్ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు.