బ్రేకింగ్.. పిడుగు పడి ఇద్దరి మృతి
పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన కొమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. వాంకిడి మండలంలో ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురిసింది. ఇందాని గ్రామ సమీపంలో పిడుగు పడి సండేవాకు బాయ్ (35) సెండే విష్ణు (6) మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.