ప్రతి ఒక్కరూ యోగా చేయాలి
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాయామం చేయాలని రాష్ట్ర సేవికా సమితి వరంగల్ జిల్లా కార్యవాహిక జ్యోతిర్మయి అన్నారు. మంగళవారం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాశీబుగ్గలోని సుందరయ్యనగర్ జడ్పీ పాఠశాల, కృష్ణకాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో యోగా చేయించారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ యోగా దినోత్సవం ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచన అని తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని, ఇది అందరిదని చెప్పారు. యోగా సాధన చేస్తే ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతాయన్నారు. యోగా సాధన మనసును ప్రశాంతంగా ఉంచుతుందన్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు సేవికలు లక్ష్మి,అమూల్య,చైత్రిని తదితరులు పాల్గొన్నారు.