ఆ సింగరేణి క్వార్టర్లు రెవెన్యూకి అప్పగించండి
సీఅండ్ఎండీతో సమావేశమైన ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను పేద ప్రజలకు అందించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. బుధవారం హైదరాబాదులో సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మందమర్రి, రామకృష్ణాపూర్,బెల్లంపల్లి,శ్రీరాంపూర్ మున్సిపాలిటీలలో పలు సింగరేణి క్వార్టర్లు ఖాళీగా ఉంటున్నాయని తెలిపారు. వాటిని పేద ప్రజలకు అందించడానికి వీలుగా రెవిన్యూ శాఖకు అందించాలని కోరారు. జీవో 76లో రామకృష్ణాపూర్లో గతంలో చేసిన సర్వేలో పలు కారణాల వల్ల మిస్ అయిన భగత్ సింగ్ నగర్,రాజీవ్ నగర్,శివాజీ నగర్,జవహర్ నగర్,శ్రీనివాస్ నగర్,మల్లికార్జున నగర్,గంగా కాలనీ,విద్యానగర్,RK 4 గడ్డ,పోస్ట్ ఆఫీస్ లైన్ కు చెందిన భూముల క్రమబద్ధీకరణకు ఆ భూములను రెవెన్యూ డిపార్ట్మెంటుకు అందించాలని కోరారు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల సింగరేణి వార్డుల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా సింగరేణి అధికారులు చొరవ చూపాలని సీఅండ్ఎండీ దృష్టికి తీసుకెళ్లారు.