విద్యుత్ షాక్ తో మృతి.. రాస్తారోకో

మంచిర్యాల : విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. ఆ యువకుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు రాస్తారోకో చేస్తున్నారు.. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాల గ్రామంలో విద్యుత్ లైన్ మరమ్మతులు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రావణ్ అనే కాంట్రాక్టు కార్మికుడు విద్యుదాఘాతంతో మరణించాడు. దీంతో మృతదేహంతో జాతీయ రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో నేపథ్యంలో వాహనాలు భారీగా నిలిచి పోయాయి. ఆందోళనకారులను శాంతింప చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.