బాసర ట్రిపుల్ ఐటీ పేరెంట్స్ కమిటీ ఎన్నిక
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఆదివారం పేరెంట్స్ కమిటీ ఎన్నుకున్నారు. కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా బొజ్జావార్ వీరనందయ్య, అధ్యక్షులుగా అక్కినపల్లి రాజేశ్వరి,ఉపాధ్యక్షులుగా దవ్వాజి కృష్ణమూర్తి,తమ్మడి చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శిగా స్రవంతి,కోశాధికారిగా గోపరాజు రమేష్,ముఖ్య సలహాదారుగా గుండ్ల కుమారస్వామిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రమాణం చేశారు.