పార్టీ మార్పు పై పురాణం క్లారిటీ
మంచిర్యాల పార్టీ మారడంపై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలో పార్టీ మారే అవకాశం లేదని స్పష్టం చేశారు. తాను కానీ తన అనుచరులు గాని పార్టీ మారబోరని స్పష్టం చేశారు. కావాలనే కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన విషయంలో మైండ్ గేమ్ ఆడుతున్నారని వెల్లడించారు. దానికి కొందరు వంత పాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. పదవి ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. తాను కచ్చితంగా టిఆర్ఎస్ లోనే ఉంటానని మరో మారు స్పష్టం చేశారు దీని విషయంలో తప్పుడు ప్రచారం చేసే వారిని ఉపేక్షించబోమన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.