ఎపికల్ కళాశాల ప్రభంజనం..
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఎపికల్ జూనియర్ కళాశాల విద్యార్థులు దుమ్ము రేపారు. స్థాపించిన మొదటి విద్యా సంవత్సరంలోనే అత్యద్భుతమైన ఫలితాలు సాధించి అబ్బురపరిచారు. ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగించి ఇందులో విద్యాబోధన నిర్వహించారు. కరోనా సమయంలో కూడా ఆన్‌లైన్ బోధనతో పాటు, ఆఫ్‌లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపించారు. హన్మకొండలోని అన్ని కళాశాలకు ధీటుగా నిలిచారు.
ఆ కళాశాలలో అత్యధిక మార్కులు 1000-984 సంఘ వర్షిణి కాలేజీ టాప్ ర్యాంక్ సాధించారు. ఇక ప్రణీత 1000-979 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. 13మంది విద్యార్థులు 950 మార్కులకు పైగా సాధించగా, 23మంది విద్యార్థులు 900 మార్కులకు పైగా సాధించారు. ఇక గణితంలో 150కి 150 మార్కులు 17 మందికి, ఫిజిక్స్‌లో 60కి 60 30 మందికి, కెమిస్ట్రీలో 60కి60 మార్కులు 17 మందికి, జువాలజీలో 60కి60 మార్కులు నలుగురికి, బోటనీలో 60కి60 మార్కులు ఐదుగురికి వచ్చినట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది.