రైల్వే సమస్యలు పరిష్కరించండి
మంచిర్యాల : బెల్లంపల్లి రైల్వే సమస్యలు పరిష్కరించాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గంచిన్నయ్య కోరారు. గురువారం హైదరాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ ని కలసి రైల్వే సమస్యలపై చర్చించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో జీటీ, దక్షిణ్,రాయ్‌పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలపాలని కోరారు. తాండూరు మండలం రేచిని రోడ్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో వారితో పాటు తాండూర్ జడ్పీటీసీ బానయ్య, ఎంపీటీసీ శంకర్ పాల్గొన్నారు …