ఆ రైలుకు పుట్టిన రోజు వేడుక‌లు

అంద‌రూ పుట్టిన రోజు చేసుకుంటారా..? త‌మ రైలుకు కూడా పుట్టిన రోజు వేడుక‌లు చేయాల‌నిపించింది రైల్వే అధికారులకు అందుకే విజయవాడ నుంచి చెన్నై మధ్య తిరిగే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ రైలు పట్టాలెక్కి…జులై 1వ తేదికి సరిగ్గా ముప్పై ఏళ్లు అవుతోంది. దీంతో విజయవాడ రైల్వే అధికారులు… దానికి పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించారు. ఉద‌యాన్నే దాన్ని శుభ్రంగా క‌డిగి, రంగు రంగు కాగితాలు అంటించారు. ర‌క‌ర‌కాల పూల‌తో అల‌క‌రించారు.

రైలు ఫ్లాట్‌ఫామ్‌ మీదకు రాగానే పుట్టిన రోజు పాట‌లు పాడుతూ కేక్ క‌ట్ చేశారు. అనంతరం పచ్చ జెండా ఊపి.. విజయవాడ రైల్వే డివిజన్‌కు మరింత మంచి పేరు తేవాలని ఆశీర్వదించారు. ఈ తతంగం అంతా చూస్తున్న ప్రయాణికులు..మొదట్లో ఏం అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత తెలుసుకుని వాళ్లు కూడా పినాకిని ట్రైన్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. అధికారులు ప్ర‌యాణీకుల‌తో సైతం కేక్ క‌ట్ చేయించారు. మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల మధ్య నిరంతరాయంగా సేవలందిస్తున్న ఇంటర్ సిటీ రైలు పినాకిని ఎక్స్‌ప్రెస్‌.

ట్రైన్‌ నెంబర్‌. 12711/12712 పినాకిని ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లో ప్రవహించే పినాకిని నది పేరుతో ఈ రైలు ప్రారంభించారు. రైలు ట్రిప్‌కు 430 కి.మీ ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో 12హాల్టులు ఉంటాయి. కృష్ణ,గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా కు చెందిన అనేక మంది ఉద్యోగులు, విద్యార్థులు, సీజన్ టిక్కెట్ హోల్డర్లు ప్రతిరోజూ ఈ రైలు ఎక్కుతారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like