అమ్మవారి ప్రసాదంలో పురుగులు
దేవాదాయ శాఖకు భక్తుల డబ్బుల మీద ఉన్న ప్రేమ ఆలయాల నిర్వహణ మీద ఉండటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ సిబ్బంది నిర్వాకంపై ఎన్ని సార్లు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదు. భద్రకాళి ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయట పడింది. ప్రస్తుతం భద్రకాళి అమ్మవారి శాఖంబరి ఉత్సవాలు కొనసాగుతున్నయి. దీంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఒక భక్తుడు కొన్న పులిహోర ప్యాకెట్ లో పురుగులు రావడం కలకలం రేపింది. గతంలో కూడా ఇలాంటివి వెలుగు చూసినా అధికారుల పర్యవేక్షణ కరువైంది. పైసల మీద ఉన్న శ్రద్ధ భక్తులకు విక్రయించే ప్రసాదం విషయంలో లేదని భక్తులు మండి పడుతున్నారు.