గోడకూలి తల్లీకూతుళ్ళు దుర్మరణం
కూలీ పని కోసం వచ్చి కానరాని లోకాలకు వెళ్లారు ఆ తల్లికూతుళ్ళు.. కొద్దిరోజులుగా వర్షాలు పడుతుండటంతో గోడ నాని వారి పై పడి మరణించారు. నల్గొండ జిల్లా పద్మారావు నగర్ లో నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21) నివసిస్తున్నారు. కొన్నేళ్ల కిందట శ్రీకాకుళం నుంచి వలస వచ్చారు. రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తెల్లవారు జామున నిద్రిస్తున్న సమయంలో గోడకూలి బీరువా మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవలే కళ్యాణికి వివాహం కూడా అయింది. మృతదేహాలు మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.