కోయ‌పోశ‌గూడెం చుట్టుముట్టిన ఖాకీలు

-గూడెం దిగ్బందించిన పోలీసులు, అట‌వీ శాఖ అధికారులు
-కారంపొడితో ఎదురుదాడికి దిగిన గిరిజ‌నం
-ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ గిరిజ‌నుల అరెస్టు

మంచిర్యాల : అట‌వీ భూమిలో గుడిసెలు వేసుకున్నార‌న్న నెపంతో వాటిని తొల‌గించేందుకు పోలీసులు, అట‌వీ శాఖ అధికారులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ భూమిలో ఉన్న మూడు గుడిసెల కోసం దాదాపు మూడు వందల మంది అటవీ, పోలీసు సిబ్బంది ఆ గూడెం చుట్టుముట్టారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోశ‌గూడెం పోడు భూమిలో స్థానిక ఆదివాసులు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు శుక్రవారం ఉదయం అటవీ, పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున చేరుకొని దాడులు ప్రారంభించారు. గురువారం సాయంత్రం ఇక్కడి గుడిసెలను తొలగించేందుకు అటవీ, పోలీసు అధికారులు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఆదివాసీ మహిళలు తీవ్రంగా ప్రతిఘటించడంతో చేసేదేమి లేక కొన్ని గుడిసెలను నేలమట్టం చేసిన అధికారులు వెనుదిరిగారు. అయితే అటవీ భూముల్లో నుంచి ఆదివాసీలను ఎలాగైనా పంపించాల‌నే లక్ష్యంతో శుక్రవారం ఉదయమే పెద్ద ఎత్తున బలగాలను మొహరించారు. ఆ గుడిసెలు తొల‌గించేందుకు ప్ర‌య‌త్నించారు.

ఒక వైపు వర్షం పడుతున్న అధికారులు గాని, ఆదివాసీలు గాని మెట్టు దిగలేదు. ఆ గుడిసెలు తొల‌గించేందుకు అధికారులు, అడ్డుకునేందుకు ఆదివాసీ మ‌హిళ‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. కొంద‌రు ఆదివాసీ మ‌హిళ‌లు అధికారుల పైన కారంపొడి చల్లి అడ్డుకున్నారు. ఎట్ట‌కేల‌కు వారిని పోలీసులు, అట‌వీ శాఖ సిబ్బంది క‌లిసి అదుపులోకి తీసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like