ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
మంచిర్యాల : సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బెల్లంపల్లి మాదారం టౌన్‌షిప్ సివిల్ డిపార్మెంట్ లో శుక్రవారం నల్ల జెండా లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జీఎం కమిటీ సభ్యుడు కొగిలాల రవీందర్, పిట్ సెక్రెటరీ గుజ్జ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మాడుపు శివానంద చారి, నాయకులు దుర్గం అశోక్, ఉస్మాన్, శ్రీనివాస్, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.