తాళ్లపేట అటవీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కోయపోషగూడెం లో అటవీ అదికారుల పై దాడి చేశారని అరెస్టు చేసి గిరిజన మహిళలను తరలిస్తున్న వాహనాలను అదివాసీలు అడ్డకున్నారు. దీంతో దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్టు చేసిన వారిని వదిలి పెట్టాలని డిమాండ్ చేస్తూ గిరిజనులుగేట్ ముందు బైఠాయించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేసే దాకా అందోళన. విరమించమని అదివాసీలు భీష్మించుకుని కూర్చున్నారు. అరెస్టు చేసిన వారిని అటవీ అదికారులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అదివాసీల అందోళనకు అదికారులు దిగి వచ్చారు. గిరిజనులను ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అరెస్టు చేసిన అదివాసీలను ఎంఅర్వో హన్మంతరావు సమక్షంలో బైండోవర్ చేశారు. తలుపులు వేసుకోని ఎమ్మార్వో బైండోవర్ కార్యక్రమం నిర్వహించడంతో గిరిజనులు లోపలికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. చివరికి గిరిజనులను వదిలేయటంతో గిరిజనులు శాంతించారు. ఆందోళన తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.