రూ. 6.08 కోట్ల నిధులు మంజూరు

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి నిధులకు సంబంధించి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. అంగ రాజ్ పల్లి నుండి ముత్తరావు పల్లి వరకు అక్కడి నుండి అన్నారం బ్యారేజీ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి 6.08 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి.ఈ మేరకు పంచాయతీ రాజ్ R&B శాఖ నుండి ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు పూర్తయితే అంగరాజ్ పల్లి, చెల్లాయిపేట్, దుగ్నేపల్లి, సుందరశాల, నర్సక్కపేట, ముత్తరావుపల్లి వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర రవాణా వ్యవస్థ. మెరుగవుతుంది. నిధుల విడుదల పై చెన్నూరు మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల రవాణా వ్యవస్థ మెరుగుపరచడంలో ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే బాల్క సుమన్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు.