నేనున్నానని.. మీకేం కాదని…
-కోయపోశగూడెం సందర్శించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
-వారి బాధలు వింటూ కంట తడిపెట్టిన సురేఖ

మంచిర్యాల : ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న గిరిజనుల పట్ల అమానుషంగా వ్యవహరించడం అప్రజాస్వామికం అని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె దండేపల్లి మండలం కోయపోశగూడెం వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. దాడికి పాల్పడిన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నో ఏండ్లుగా పోడు చేసుకుంటున్న వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నించడం అమానుషమన్నారు. గాయపడ్డ మహిళలను ఓదార్చుతూ ఆమె కూడా కంటతడి పెట్టారు. మీ వెంట మేం ఉంటామని భరోసా ఇచ్చారు.