రోడ్డును తెంపి.. గ్రామాన్ని కాపాడి..
మంచిర్యాల : భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుంటున్నాయి. వరద నీరు గ్రామాలను చుట్టుముడుతోంది. అవి బయటకు వెళ్లే దారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోకి వరద నీరు భారీగా చేరింది. ఆ నీరు బయటకు వెళ్లే దారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడి, వరద ఉధృతి మరింతగా పెరిగితే ఆ గ్రామం మునగడం ఖాయం. ఈ నేపథ్యంలో అధికారులు, గ్రామస్తులు కలిసి నిర్ణయం తీసుకున్నారు. నిజమాబాద్, జగదల్పూర్ రహదారి 63 రోడ్డు తెంపారు. దీంతో గ్రామంలో ఉన్న నీరు బయటకు వెళ్తోంది.