మీ వెంటే ఉంటాం
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
భారీ వర్షాల కారణంగా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే తమను సంప్రదించాలని, ప్రజల సేవ కోసం తాను సిద్దంగా ఉంటానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. వర్షాల కారణంగా బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీలో కూలిపోయిన వారి ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వారికి పునరావసం, ఉచితంగా భోజన వసతి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయనతో పాటు కౌన్సిలర్ దామెర శ్రీనివాస్, కమిషనర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు..