వాగులో కొట్టుకుపోతుంటే కాపాడారు..
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని నేరడిగొండ మండలం దర్బాతండా కు చెందిన ఇద్దరు యువకులు బైక్ పై వాగు దాటే ప్రయత్నం చేశారు. దీంతో అదుపు తప్పి బైక్ పాటు కొంత దూరం కొట్టుకుపోయారు. వారిని చూసిన స్థానికులు వారిని కాపాడారు. ఆ ఇద్దరు యువకులు ప్రాణాలతో బయట పడ్డారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా బయట రావొద్దని ఎస్ఐ మహేందర్ తెలిపారు. అత్యవసరం అయితేనే వెళ్లాలని, అవసరం అయితే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.