సింగరేణిలో మరో కీచకుడు
సింగరేణిలో ఓ కీచక అధికారి కూతురు వయస్సున్న మహిళను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. తాను పనిచేస్తున్న ప్రాంతంలోనే ఈ అచారకానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించడం గమనార్హం.
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటీ ఏరియా స్టోర్స్‌లో సీనియర్ అధికారి సాంబశివరావు సీనియర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన వయసు 54 సంవత్సరాలు. కాగా, తన కూతురు వయస్సు (27 సంవత్సరాలు) ఉన్న ఓ గిరిజన యువతి సోమవారం విధుల్లో ఉండగా తన కోరిక తీర్చమని వెంటపడ్డాడు. దీంతో ఆ అమ్మాయి ప్రతిఘటించింది. దగ్గరకు లాక్కునే ప్రయత్నం చేయడంతో అమ్మాయి తిరస్కరించగా, ఆ యువతిని కొట్టాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో కార్మికులు అక్కడికి చేరుకున్నారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని మంగళవారం జీఎం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
అయితే, అధికారులు అతనిపై చర్యలు తీసుకోకుండా కేవలం బదిలీ చేసి సమస్య సద్దుమణిగేలా చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అతనిపై సస్పెన్షన్ వేటు వేయడకుండా కొందరు నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. దూర ప్రాంతానికి ట్రాన్‌ఫర్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అతనిపై కేసు పెట్టి విధుల్లో నుంచి తొలగించాలని గిరిజన సంఘాల నేతలు కోరుతున్నారు.