ఆ ఇద్దరు మృతి
ఆసిఫాబాద్ జిల్లా పెసరకుంట పెద్దవాగులో గల్లంతైన సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులిద్దరు మరణించారు. దహేగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోగా గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సింగరేణి రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మందమర్రి ఏరియాకు చెందిన సీహెచ్.సతీష్, రాము ఇద్దరు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు గురువారం ఉదయం లభించాయి.