హెలికాప్టర్ ద్వారా ఇద్దరిని రక్షించిన సిబ్బంది
చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని హెలికాప్టర్ ద్వారా రక్షించారు. బుధవారం మేకలను కాసేందుకు వెళ్లిన కాపరులు వెనక్కి వచ్చే సమయానికి వరద ముంచెత్తింది. దీంతో వారు వాటర్ ట్యాంక్ ఎక్కేసారు. వరద ఉదృతి తీవ్రం కావడం తో ఎవరు వారిని కాపాడే సాహసం చేయలేకపోయారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వారిని కాపాడడానికి మంత్రి కేటీఆర్తో మాట్లాదారు. దీంతో హుటాహుటిన హెలికాప్టర్ ను తెప్పించి ఇద్దరిని తరలించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.