వాహనం ఎక్కించి.. .వాగులు దాటింది..
గర్భిణీ మహిళను సురక్షితంగా హాస్పిటల్ పంపిన నీల్వాయి ఎస్ఐ
తొమ్మిది నెలల నిండు గర్భిణి… బెల్లంపల్లి ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. కానీ రహదారులు సరిగ్గా లేవు. వాహన సౌకర్యం లేదు. దీంతో బాధితులు పోలీసులు సంప్రదించారు. వేమనపెల్లి మండలం కల్మలపేట గ్రామానికి చెందిన 9 నెలల నిండు గర్భిణీ, ఆమె భర్త ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నీల్వాయి ఎస్ఐ నరేష్ వెంటనే స్పందించి పోలీసు వాహనంలో గర్భిణీ, ఆమె భర్తను ఎక్కించుకొని తీసుకువెళ్లారు. నాగారం అటవీ ప్రాంతం వాహనం గుండా వెళ్లే వీలు ఉన్నంత వరకు తీసుకెళ్లారు. అక్కడి నుండి వరద నీరు పారుతున్న కల్వర్టు దాటించారు. అక్కడ మళ్లీ ప్రైవేట్ వాహనం లో ఆమెను ఎక్కించి సురక్షితంగా బెల్లంపల్లి పంపించారు. సాయం కోసం పోలీసులను సంప్రదించగా వెంటనే స్పందించినందుకు గర్భిణీ కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.