వరదల్లో కొట్టుకుపోయిన రిపోర్టర్ మృతి

జగిత్యాలలో మూడు రోజుల క్రితం వరదలో చిక్కుకున్న జగిత్యాల రిపోర్టర్ జమిర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఆయన ప్రయాణించిన కారు రెస్క్యూ ఆపరేషన్ లో లభ్యమయ్యింది. జమీర్ మృతదేహం పొదల్లో చిక్కుకుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంఘటన స్థలంలో పరిస్థితిని పర్యవేక్షించారు. శవపరీక్షలు సంఘటన స్థలంలోనే నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం మృత దేహాన్ని జగిత్యాల తరలించాలనీ పోలీస్ శాఖ ను ఆదేశించారు. జమిర్ Ntvలో పనిచేస్తున్నారు.