ఇది మోదీ భారతం
భారత్‌లో 200 కోట్ల వ్యాక్సినేషన్ డోసుల పూర్తిపై బిల్ గేట్స్

భారతదేశంలో 200 కోట్ల వ్యాక్సినేషన్ డోసుల పూర్తి కావడంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. దేశ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. భారత వ్యాక్సిన్ తయారీదారులతో భాగస్వామ్యం కొనసాగింపుపై కూడా కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్-19 ప్రభావాన్ని తగ్గించినందుకు భారత వ్యాక్సిన్ తయారీదారులు, భారత ప్రభుత్వంతో మా నిరంతర భాగస్వామ్యాన్ని గొప్పగా భావిస్తున్నామంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ప్రధాని మోడీ భారత్ మరో చరిత్ర సృష్టించిందంటూ వ్యాక్సినేషన్‌పై ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 100 కోట్ల డోసులు పూర్తైన సందర్భంలో కూడా యాన అభినందనలు తెలిపారు. ఈ విజయం దేశ శక్తి, సామర్థ్యాలకు నిదర్శనమని చెప్పారు.