ఏం రా… గో బ్యాక్ అంటున్నావ్..
-ఆందోళన కారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
-పెంబిలో ఉద్రిక్తత
ఏం రా… ఏం గో బ్యాక్ అంటున్నావ్.. తనను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన ఆందోళనకారులపై ఖానాపూర్ ఎంఎల్ఏ రేఖా శ్యామ్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంత పెంబి మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెంబి మండలంలో ఎంపీపీ భర్తను అక్రమంగా అరెస్ట్ చేయించారని కాంగ్రెస్,బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. అప్పుడే అటుగా ఎమ్మేల్యే రేఖా శ్యామ్ నాయక్ వచ్చారు. దీంతో ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నేను ఎవరిని అరెస్ట్ చేయించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఆందోళన కారులు నినాదాలు చేయడంతో ఆమెకు కోపం వచ్చింది. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకారులను తోసుకుంటూ వెళ్లారు. అటు కాంగ్రెస్,బీజేపీ నాయకులు ఇటు ఎమ్మెల్యే అనుచరుల మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో కొట్టుకునే వరకు వెళ్ళింది. పోలీసులు రెండు వర్గాలు పక్కకు జరిపారు. అయినా ఆవేశం ఆపుకోని రేఖా శ్యామ్ నాయక్ వెనక్కి తిరిగి దొంగలు అంత అంటూ తిట్టారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఎమ్మెల్యే ను తీసుకుని వెళ్లిపోయారు.