ఇంజనీరింగ్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయండి
బెల్లంపల్లి నియోజకవర్గంలో విద్యాపరంగా ఉన్న పలు సమస్యలపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మంత్రితో బెల్లంపల్లి లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీ గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయాలన్నారు. తాను చెప్పిన వాటికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.