అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం
బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. అంతకుముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకుని తన చావుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజేశం కారణం అవుతారని సానిటైజర్ తాగారు.
బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి తన సెంటర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద ఆ పాఠశాలలో పనులు కొనసాగుతున్నాయి. దీంతో అంగన్వాడీ సెంటర్ వేరే చోటకి మార్చలని ప్రభుత్వ ఉపాధ్యాయులు కోరారు. అక్కడ నుండి తీస్తే తనకి ఇబ్బంది అవుతుందని భాగ్యలక్ష్మి చెప్పారు. ఇదే విషయం లో కొద్ది రోజులుగా వారి మద్య తగాదా నడుస్తున్నట్లు తెలుసుతోంది. ఈ నేపధ్యంలో ఈ రోజు అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి తాను చనిపోతే ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజేశం కారణం అవుతారని సానిటైజర్ తాగారు. ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.