ప్రజలకు సాయం చేయండి
తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వరదల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు నేపథ్యంలో పార్టీ శ్రేణులకు జన్మదిన సంబురాలు చేయవద్దని కోరారు. స్థానికంగా ఉన్న ప్రజలకు సాయం చేయాలని కేటీఆర్ కోరారు. “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం కింద ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.