కడెం ప్రాజెక్టు సందర్శించనున్న సీఎం
రెండు హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్న అధికారులు

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. వరద నీటితో సమస్యను ఎదుర్కొంటున్న కడెం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సందర్శించనున్నారని అధికారులు తెలిపారు. కేసీఆర్ పర్యటన కోసం కడెం మండల కేంద్రంలో ఆర్అండ్బీ అధికారులు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కడెం మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా మైదానంలో హెలిప్యాడ్ పనులను ప్రారంభించారు. మరోవైపు నిర్మల్ జిల్లా కేంద్రంలో సైతం మరో హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో కేసీఆర్ వస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే వాతావరణం ఇలాగే ఉంటే ఆయన పర్యటన అనుమానమే అని కూడా చెబుతున్నారు.