క‌డెం ప్రాజెక్టు సంద‌ర్శించిన మ‌రో నిపుణుల బృందం

నిర్మల్ జిల్లాలో ఇటీవల భారీ వరదతాకిడికి గురైన కడం ప్రాజెక్టు వరద గేట్లను మంగ‌ళ‌వారం మ‌రో నిపుణుల బృందం ప‌రిశీలించింది. గ‌త సోమ‌వారం ఇక్క‌డకు వ‌చ్చిన బృందం ప్రాజెక్టును ప‌రిశీలించి నివేదిక అంద‌చేసింది. అదే విధంగా మంగ‌ళ‌వారం మెకానికల్, మెయింటెనెన్స్ బృందం ప్రాజెక్టును సంద‌ర్శించింది. టీం సభ్యులు క్రస్ట్‌గేట్లు, ప్రధాన కాలువను పరిశీలించారు. హైదరాబాద్కు చెందిన ఆపరేషన్, మెయింటెనెన్స్ ఎస్ఈ సంజీవ్ ఆధ్వ‌ర్యంలో ఈ బృందం త‌నిఖీ చేసింది. వారితో పాటు స్థానిక నీటి పారుద‌ల శాఖ అధికారులు సైతం ఉన్నారు. ఎడమ కాలువ వద్ద పడిన గండి ప్రదేశాన్ని పరిశీలించింది. నిర్మల్‌ జిల్లాలో వారం రోజులపాటు ఏకధాటిగా కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టుకు దాదాపు 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రధాన కాలువకు గండి పడడంతోపాటు క్రస్ట్‌గేట్లకు కూడా ఇబ్బందయ్యింది. రెండు క్రస్టుగేట్ల కౌంటర్‌ వెయిట్‌ తెగిపోవడం, గేట్ల నుంచి వరద పారడంతో మిషన్‌ వ్యవస్థ పాడవడం,విద్యుత్‌ సమస్య త‌లెత్తింది. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్టు స్థితిగ‌తులు, దాని మ‌ర‌మ్మ‌తుల‌కు ఏం చేయాలి..? అనే వాటిపై ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కు రెండు బృందాలు క‌డెం ప్రాజెక్టును తనిఖీలు చేశారు. రెండు బృందాల నివేదిక‌లు అందిన త‌ర్వాత ఉన్న‌తాధికారులు ఈ ప్రాజెక్టు విష‌యంలో నిర్ణ‌యం తీసుకోనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like