దివాకర్‌రావ్.. రాజీనామా చేయ్..
-వరద బాధితులకు తక్షణ సాయం ప్రకటించాలి
-ముఖ్యమంత్రి అన్ని జిల్లాలు పర్యటించారు
-మంచిర్యాలకు ఎందుకు రాలేదు...?
-బాధితులతో కలిసి మరింత ఉద్యమం చేస్తం
-బిజెపి జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్
వరదలు వచ్చి 15 రోజులు అవుతోంది.. పట్టించుకున్న నాథుడు లేడు. అన్ని జిల్లాలు పర్యటించిన ముఖ్యమంత్రి మంచిర్యాల ఎందుకు రాలేదు..? ఇది ఖచ్చితంగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు వైఫల్యమే. అందుకే ఆయన వెంటనే రాజీనామా చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. వరద బాధితులతో కలిసి ఆయన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల, వేంపల్లి ప్రాంతంలో వరదలు వచ్చి 15 రోజుల దాటిన బాధిత ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.
వరదలు వచ్చిన ఇతర జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ పర్యటించి మంచిర్యాల జిల్లాలో ఎందుకు పర్యటించలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ను జిల్లాకు తీసుకురావడంలో ఎమ్మెల్యే దివాకర్ రావు విఫలం అయ్యారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే దివాకర్ రావు అసమర్థత వల్లనే మంచిర్యాల జిల్లాకు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించలేదన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మంచిర్యాలలో పర్యటించి వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, జిల్లాకు రూ.5 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలన్నారు. నష్టపరిహారం చెల్లించని పక్షంలో బాధితులతో కలిసి మరింత ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మున్నరాజాసిసోడియా, పోనుగోటిరంగరావు, అరుముల్లపోశం, మోటపలుకులతిరుపతి, రజినిష్జైన్, రేకందర్ వాణి, గుండ ప్రభాకర్, మధవరపురమణరావు, తులఆంజనేయులు, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, అగల్ డ్యూటీరాజు, బొప్పుకిషన్, బోలిషెట్టితిరుపతి, బోద్దున మల్లేష్, జోగులశ్రీదేవి, పట్టి వెంకటకృష్ణ, మిట్టపల్లిమొగిలి, ముదాంమల్లేష్, పచ్చవెంకటేశ్వర్లు, బల్లరమేష్, గాజులప్రభాకర్, అమిరిశెట్టిరాజు, పల్లిరాకేష్, రెడ్డిమల్లఅశోక్, నాగులరాజన్న, రాకేష్ రేన్వ, స్వప్నరెడ్డి పాల్గొన్నారు