పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మృతి

పిడుగుపాటుతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన కోటపల్లి మండలంలో జరిగింది. సుందిళ్ళ రామనీలా(45) అనే వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. హఠాత్తుగా వర్షం పడటంతో పాటు ఆమెపై పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే పడిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా రామనీలా చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలి భర్త దేవయ్య కోటపల్లి మండల విద్యావనరుల కేంద్రంలో మెసెంజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది.