కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కి రెండు పతకాలు

Commonwealth Games 2022 : కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కి వెయిట్‌లిప్టర్స్ రెండు పతకాలు సాధించారు. బర్మింగ్‌హామ్ వేదికగా శనివారం జరిగిన పురుషుల వెయిట్‌లిప్టర్స్ ఫైనల్లో 55 కేజీల విభాగంలో పోటీపడిన సంకేత్ సాగర్ స్నాచ్, క్లీన్ అండ్ జర్క్‌తో కలిపి మొత్తం 248 కిలోలు బరువు ఎత్తి రజత పతకాన్ని గెలుపొందాడు. 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి స్నాచ్, క్లీన్ అండ్ జర్క్‌తో కలిపి మొత్తం 269 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకాన్ని భారత్‌కి అందించాడు.
పురుషుల 66 కేజీల వెయిట్‌లిప్టింగ్ పోటీల్లో మలేసియాకి చెందిన అజ్నిల్ బిడిన్ 285 కేజీలు బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత న్యూ జెనీవాకి చెందిన మోరియా బారు 273 కేజీల బరువు ఎత్తి సిల్వర్ మెడల్ని అందుకోగా.. గురురాజ పూజారి 269 కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 118 కిలోల బరువు ఎత్తిన గురురాజ పూజారి.. క్లీన్ అండ్ జర్క్‌లో 151 కిలోల బరువు ఎత్తాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో గురురాజ పూజారి పతకం గెలవడం వరుసగా ఇది రెండోసారి. సంకేత్ కు ఇదే తొలి కామన్వెల్త్ గేమ్స్ కావడం విశేషం.